News February 25, 2026
జగిత్యాల: రాష్ట్రస్థాయిలో మెరిసిన జిల్లా క్రీడాకారులు

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన 2వ ఎడిషన్ సీఎం కప్-2025లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించారు. వివిధ మండలాల నుండి పాల్గొన్న వారు కబడ్డీ, ఖో-ఖో, యోగ, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, కిక్ బాక్సింగ్, జూడో, జిమ్నాస్టిక్స్ క్రీడల్లో రాణించారు. బాస్కెట్‌బాల్, ఖో-ఖోలో కాంస్యాలు, బాక్సింగ్, యోగ, జావెలిన్ త్రో, కిక్ బాక్సింగ్‌లో రజత పతకాలు దక్కాయి. కలెక్టర్ సత్యప్రసాద్ అభినందించారు.
Similar News
News February 26, 2026
VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

విజయనగరం జిల్లా ఎల్.కోట మండలంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వేపాడ (M) గుడివాడకు చెందిన గుడివాడ కిషోర్ (19) తన బైక్ పై కొట్యాడలో ఉన్న తాతగారి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఖాసాపేట సమీపంలో గల వంతెన వద్ద బైక్ అదుపు తప్పడంతో గెడ్డలో పడి మునిగి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ పాపారావు తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 26, 2026
ఆధార్ సెంటర్ ఎక్కడుందో ఈజీగా తెలుసుకోవచ్చు!

మీ ప్రాంతంలో ఆధార్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడం ఇబ్బందిగా ఉందా? త్వరలో అలాంటి సమస్య ఉండదు. గూగుల్ మ్యాప్స్‌లో సెంటర్ అడ్రస్, అక్కడ అందే సేవల డిటైల్స్ కనిపించనున్నాయి. పార్కింగ్, సెంటర్ టైమింగ్స్ తదితర వివరాలూ తెలుసుకోవచ్చు. అందుకు గూగుల్‌తో UIDAI ఒప్పందం కుదుర్చుకుంది. ఆధార్ నమోదు, తప్పుల సవరణ తదితరాలకు ఈజీగా అధికారిక సెంటర్లను గుర్తించడానికి ఇది దోహదపడుతుందని UIDAI తెలిపింది.
News February 26, 2026
HYD: బడా బాబుల ‘కోటల’ గుట్టు రట్టు!

మూసీ సుందరీకరణలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు గర్జిస్తున్నా 42 బడా సంస్థల విషయంలో యంత్రాంగం మౌనం వహిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి. అంబర్‌పేటలోని ఇంజినీరింగ్ కాలేజీలు, అత్తాపూర్‌లోని మల్టీప్లెక్స్‌లు, నాగోల్‌లోని ఫంక్షన్ హాళ్ల జాబితా సిద్ధమైనా అవి రాజకీయ నేతల బినామీ ఆస్తులు కావడంతో GOVT ఆచితూచి అడుగులేస్తోంది. హైడ్రా మార్కింగ్ చేసినా పెనాల్టీతో రెగ్యులరైజ్ చేసే రహస్య ఒప్పందాలు జరుగుతున్నట్లు సమాచారం.


