News August 26, 2025
జగిత్యాల రూరల్: సర్కిల్ కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మంగళవారం జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డ్స్‌ను, పరిసరాలను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్‌ఫర్‌మేషన్ బుక్, క్రైం రికార్డు, ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్లను పరిశీలించారు. సర్కిల్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్న కేసుల్లో ఉన్న సీడీ ఫైల్స్‌పై అడిగి తెలుసుకున్నారు.
Similar News
News August 26, 2025
జగిత్యాల: భారత వైమానిక దళంలో ఉద్యోగ అవకాశాలు

అగ్నిపత్ భారత వైమానిక దళంలో క్లారికల్, టెక్నికల్ కేడర్లలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి సత్యమ్మ మంగళవారం తెలిపారు. తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు ఈనెల 27న, మహిళా అభ్యర్థులకు వచ్చే నెల 6న ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ చెన్నైలో అగ్నివీర్ నియామక ర్యాలీ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలన్నారు.
News August 26, 2025
ఆ హీరోయిన్ అంటే మా నాన్నకు ఇష్టం: శ్రుతి హాసన్

బెంగాలీ నటి అపర్ణ సేన్ అంటే తన తండ్రి కమల్ హాసన్‌కు ఇష్టం ఉండేదని శృతిహాసన్ తెలిపారు. ‘నాన్న బెంగాలీలో ఒక సినిమా చేశారు. ఆ సమయంలో అపర్ణ సేన్‌తో ప్రేమలో పడ్డారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నారు. నాన్న డైరెక్ట్ చేసిన “హే రామ్” మూవీలో హీరోయిన్ పాత్ర పేరును కూడా అందుకే అపర్ణ సేన్‌గా మార్చారు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అపర్ణ సేన్ 9 జాతీయ అవార్డులు, 1987లో పద్మశ్రీ అందుకున్నారు.
News August 26, 2025
ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీలు.. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ

TG: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 48,630 సీట్లను పాఠశాల విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనుంది. 6thలో 7,543, 7thలో 5,192, 8thలో 3,936, 9thలో 2,884, 10thలో 3,151, ఇంటర్ సెకండియర్‌లో 13,256, ఫస్టియర్‌లో 12,668 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించగా, మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేయనుంది. సీట్ల కోసం స్కూళ్లలో సంప్రదించాలి.