News February 1, 2025

జగిత్యాల: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

image

మెట్‌పల్లి చింతల్‌పెట శివారులో శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న 2 బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇబ్రహీంపట్నం వేములకుర్తికి చెందిన బర్మా నగేశ్(32) మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చింతల్‌పేట-వేములకుర్తికి వెళ్తున్న నగేశ్.. మెట్‌పల్లి-యూసుఫ్‌నగర్‌కు వస్తున్న సోఫియాన్ బైకులు చింతలపేట శివారులో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నగేశ్ అక్కడికక్కడే మృతి చెందగా సోఫియాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

Similar News

News February 1, 2025

NGKL: మైనర్‌ బాలికకు వేధింపులు.. కేసు నమోదు

image

ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను వేధింపులకు గురిచేసిన యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చారకొండకు చెందిన మహేశ్ అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల మైనర్‌ను వేధించేవాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు.

News February 1, 2025

ఎన్టీఆర్: 67.38% మేర జరిగిన పింఛన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన NTR భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయం 10 గంటల వరకు 67.38% మేర పంపిణీ అయ్యింది. జిల్లాలో 2,29,914 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా 1,54,926 మందికి ప్రభుత్వ యంత్రాంగం పింఛన్ అందజేసింది. కాగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పింఛన్ పంపిణీ ప్రక్రియకు రాజకీయ పక్షాల నేతలు దూరంగా ఉన్నారు. 

News February 1, 2025

వాట్సాప్ డీపీలతో జాగ్రత్త! నమ్మితే అంతే..

image

HYDకు చెందిన మహిళకు కొత్త నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. డీపీగా కజిన్ ఫొటో ఉండటంతో అతడే అని భావించి మాట్లాడింది. అవతలి వ్యక్తి కజిన్ పేరు చెప్పి, పరిచయస్థుడిలా మాట్లాడాడు. అర్జెంటుగా ఇండియాలో ఉన్న వ్యక్తికి డబ్బులు పంపాలని, రేపటికల్లా ఇచ్చేస్తానని నమ్మించాడు. ఆమె రూ.2 లక్షలు పంపింది. మళ్లీ డబ్బులు అడగ్గా అనుమానం వచ్చి కజిన్‌కు ఫోన్ చేసింది. మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.