News October 12, 2025
జగిత్యాల: రేపటి నుంచి యథావిధిగా ప్రజావాణి

ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం జగిత్యాల కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రేపటి నుంచి యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కారం పొందవచ్చని సూచించారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఇటీవల రద్దు చేయగా, ఎన్నికలకు బ్రేక్ పడడంతో మళ్లీ రేపట్నుంచి ప్రారంభం కానుంది.
Similar News
News October 12, 2025
నా కూతురికి రక్షణ లేదు.. రేప్ బాధితురాలి తండ్రి ఆందోళన

పశ్చిమ బెంగాల్‌లో తన కూతురి భద్రత గురించి ఆందోళనగా ఉందని <<17979948>>గ్యాంగ్‌రేప్<<>> బాధితురాలి తండ్రి వాపోయారు. ‘నా బిడ్డ ప్రస్తుతం నడవలేకపోతోంది. డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మమ్మల్ని ఒడిశాకు వెళ్లనివ్వండి. అక్కడే తను సురక్షితంగా ఉండగలదు’ అని చెప్పారు. కాగా ఫ్రెండ్‌తో కలిసి బయటకు వెళ్లిన మెడికల్ స్టూడెంట్‌పై ముగ్గురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
News October 12, 2025
విశాఖ రానున్న మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం విశాఖ రానున్నారు. రాత్రి నగరంలోనే బసచేయునున్న మంత్రి సోమవారం వైఎంసీఏలో నిర్వహించనున్న విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం శ్రీకాకుళం బయలుదేరి వెళతారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మళ్లీ సోమవారం రాత్రికి విశాఖ చేరుకుంటారు.
News October 12, 2025
గుంటూరు జిల్లాలో ముఖ్య అధికారుల ఫోన్ నెంబర్‌లు

@ కలెక్టర్ తమీమ్ అన్సారియా: 9849904002.
@ జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ: 9849904003.
@ గుంటూరు IG సర్వ శ్రేష్ట త్రిపాటి: 9440627241.
@ SP వకుల్ జిందాల్: 8688831300.
@ ASP అడ్మిన్: 8688831302.
@ DMHO విజయలక్ష్మీ: 9849902337.
@ DEO రేణుక: 9849909107.
@ DFO: 9949991062.
@ DTC: 9154294107.
@ గుంటూరు RTC RM: 9959225412.
@ Lost Cellphone Whatsapp:8688831574.