News February 24, 2025
జగిత్యాల: రేపట్నుంచి ప్రచారం నిషేధం: కలెక్టర్

MDK, NZB, KNR, ALD పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..సైలెన్స్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 25 సాయంత్రం 4.00 నుంచి ఈ నెల 27 సాయంత్రం 4.00 వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, బల్క్ ఎస్ఎంఎస్‌లు పంపడంపై నిషేధమన్నారు.
Similar News
News November 17, 2025
హనుమకొండ: కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసిన ఆర్మీ అధికారులు

హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్‌ను చెన్నైలోని ఆర్మీ రిక్రూటింగ్ డీడీజీ, బ్రిగేడియర్ ఆర్.కె. అవస్థి, సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్ డైరెక్టర్ కల్నల్ సునీల్ యాదవ్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి సంబంధించిన అంశాలపై ఆఫీసర్లు చర్చించారు.

కేయూ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించేందుకు కేయూ నూతన విద్యార్థి జేఏసీని నేతలు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆరేగంటి నాగరాజ్, వైస్ ఛైర్మన్‌గా కేతపాక ప్రసాద్, కన్వీనర్‌గా కందికొండ తిరుపతి, కో-కన్వీనర్‌గా అల్లం విజయ్, ప్రధాన కార్యదర్శిగా బోస్కా నాగరాజ్, కార్యదర్శిగా జనగాం రాజారాం, కోశాధికారిగా రేగుల నరేశ్ నియమితులయ్యారు.