News January 7, 2026

జగిత్యాల: రేపు ఎఫ్‌పీఓలకు శిక్షణ

image

ఆహార ఉత్పత్తి సంస్థలుగా ఎంపికైన జగిత్యాల జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వారికి గురవారం ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శిక్షణా తరగతులు హైదరాబాద్ కో ఆపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించబడునన్నారు. ప్రతి సంఘం నుంచి కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్, ఐదుగురు సభ్యులు హాజరు కావాలన్నారు.

Similar News

News February 14, 2026

పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు: అచ్చెన్న

image

APలో భూసార పరీక్షలు నిర్వహించి 6 లక్షల మంది రైతులకు ఫలితాల పత్రాలు అందించామని బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీలో మంత్రి అచ్చెన్న తెలిపారు. ‘పొలం పిలుస్తోంది’తో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించామన్నారు. బడ్జెట్‌లో పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు, యాంత్రీకరణలో 50% రాయితీ కోసం రూ.136 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 80% రాయితీతో రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News February 14, 2026

సంగారెడ్డి: మున్సిపల్ ఛైర్మన్‌, వైస్ ఛైర్మన్‌ అభ్యర్థుల ప్రకటన

image

సంగారెడ్డి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం ప్రకటించారు. ఛైర్మన్ అభ్యర్థిగా 23వ వార్డు కౌన్సిలర్ కూన వనితను, వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా 24వ వార్డు కౌన్సిలర్ షేక్ షఫీయొద్దీన్‌ను ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో సంగారెడ్డి మున్సిపల్ పీఠంపై ఉత్కంఠకు తెరపడింది.

News February 14, 2026

సదాశివపేట: మున్సిపల్ చైర్మన్‌గా అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక

image

సదాశివపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శనివారం అధికారికంగా ప్రకటించారు. చైర్మన్ అభ్యర్థిగా అంజమ్మ, వైస్ చైర్మన్‌గా రేణుక పోటీ చేస్తారని ఆయన వెల్లడించారు. ఈ నెల 16న జరిగే ఎన్నికల్లో వీరిని ఎన్నుకోవాలని సూచిస్తూ, కౌన్సిలర్లకు పార్టీ తరపున విప్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఎంపికతో మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు బిగించనుంది.