News February 6, 2025

జగిత్యాల: రైతుభరోసా నిధులు విడుదల

image

ఒక ఎకరం వరకు ఉన్న రైతుల అకౌంట్లలో ఇవాళ రైతుభరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపింది. అయితే, రైతుభరోసా కింద జగిత్యాల జిల్లాలో 84,504 మంది రైతులకు గాను రూ.35,61,20,462 విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. రైతుభరోసా నిధులను విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 6, 2025

బోథ్: గుండెనొప్పితో ఉపాధ్యాయుడు మృతి

image

బోథ్‌లోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు దేవరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇచ్చోడ మండలం కోకస్ మున్నూరు గ్రామానికి చెందిన దేవరాజ్ బుధవారం ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యాడు. సాయంత్రం గుండెలో నొప్పి వస్తుందని తోటి ఉపాధ్యాయులకు తెలపడంతో వారు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News February 6, 2025

భారత్‌తో శాంతి కోరుకుంటున్నాం.. కానీ: పాక్ పీఎం షరీఫ్

image

శాంతి పేరుతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన(ఆర్టికల్ 370 రద్దు) నుంచి బయటకు రావాలన్నారు. POK అసెంబ్లీలో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

News February 6, 2025

ADB: అధికారులతో కలెక్టర్ సమావేశం

image

ఈ నెల 10న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ అభిగ్యన్ మల్వియా, DMHO నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా టీబీ నియంత్రణ అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!