News March 23, 2025
జగిత్యాల: రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు ‘ఛలో అసెంబ్లీ’

జగిత్యాల జిల్లా శాఖ రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం చేపట్టనున్నట్లు జిల్లాలోని రైతులు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీని చేయాలని, కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15,000 అర్హుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు అధికసంఖ్యలో రావాలని వారు కోరారు.
Similar News
News November 14, 2025
NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.
News November 14, 2025
రబీ మొక్కజొన్న కలుపు నివారణ ఎలా?

మొక్కజొన్న విత్తిన 48 గంటలలోపు 200 లీటర్ల నీటిలో తేలిక నేలలకు అట్రాజిన్ 800గ్రా, బరువు నేలల్లో 1200 గ్రా. కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. తర్వాత 25-30 రోజులకు కలుపు ఉద్ధృతిని బట్టి 200 లీటర్ల నీటిలో టెంబోట్రయాన్ 34.4%S.C ద్రావణం 115ml కలిపి కలుపు 3,4 ఆకుల దశలో పిచికారీ చేయాలి. తుంగ సమస్య ఎక్కువుంటే ఎకరాకు 200 లీటర్ల నీటిలో హేలోసల్ఫ్యురాన్ మిథైల్ 75 W.G 36 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News November 14, 2025
స్వచ్ఛతా అవార్డు అందుకున్న సింగరేణి C&MD

కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ 5.0 కార్యక్రమంలో సింగరేణి సంస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ కంపెనీగా ఎంపికైంది. ఢిల్లీలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా సింగరేణి C&MD బలరాం అత్యుత్తమ స్వచ్ఛతా కంపెనీ అవార్డును అందుకున్నారు. సంస్థ అధికారులు, ఉద్యోగులను C&MD ఈ సందర్భంగా అభినందించారు.


