News January 21, 2026
జగిత్యాల: రైతు గోస పట్టదా? పాలకుల హామీలు నీటి మూటలే!

జిల్లా రైతులను ప్రధాన సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. ఎన్నికలు ఎన్ని వచ్చినా అన్నదాతలకు ఒరిగిందేమీ లేదు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. ఐతే పసుపు బోర్డుతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అలాగే జిల్లాలో ఉన్న ఒకే ఒక్క చక్కెర ఫ్యాక్టరీ మూత పడింది. కాలువలు మరమ్మతు చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు SRSP నీరు అందటం లేదు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కారంచాలని రైతులు కోరుతున్నారు.
Similar News
News February 21, 2026
అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుకను శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారిని గర్భగుడి నుంచి ఊరేగింపుగా బేడ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ , అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణ వేడుకను అర్చకులు జరిపారు.
News February 21, 2026
ABVP Vs SFI: ఏయూలో మరోసారి హైటెన్షన్

AP: విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వద్ద <<19173653>>మరోసారి<<>> ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన SFI, AISF కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ మెయిన్ గేటు వద్ద ABVP ఆందోళనకు దిగింది. దీంతో వారిని నిలువరించేందుకు ప్రయత్నించగా తోపులాట జరిగింది. AUలో రెండు రోజుల క్రితం RSS మార్చ్‌ను SFI అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. SFI-ABVP మధ్య ఘర్షణ జరిగింది.
News February 21, 2026
బాన్సువాడలో ప్రశాంతత.. పుకార్లను నమ్మవద్దు: SP

బాన్సువాడలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని KMR జిల్లా SP రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని SP పేర్కొన్నారు. శాంతికి విఘాతం కలిగించే వారి పట్ల రాజీపడబోమని స్పష్టం చేశారు.


