News July 8, 2025
జగిత్యాల: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి’

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ లత అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జగిత్యాల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు, ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News July 8, 2025
సత్వర న్యాయం కోసమే ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే: SP

బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు SP మహేష్ బీ గితే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 23 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
News July 8, 2025
దేశంలో తెలుగు మాట్లాడేవారు ఎంత మందో తెలుసా?

భారతదేశంలో సుమారు 22 రాజ్యాంగబద్ధ భాషలతో పాటు వేలాది భాషలు వాడుకలో ఉన్నాయి. అయితే, ఎక్కువ మంది హిందీ భాషనే మాట్లాడుతుంటారు. దేశంలో హిందీని 54కోట్ల మంది మాట్లాడతారని తెలుస్తోంది. ఆ తర్వాత బెంగాలీని 10కోట్ల మంది, మరాఠీని 8.5 కోట్ల మంది, తెలుగును 8.3 కోట్ల మంది మాట్లాడతారని అంచనా వేస్తున్నారు. తమిళం(7.8 కోట్లు), గుజరాతీ(6 కోట్లు), 5.5 కోట్ల మంది ఉర్దూను మాట్లాడుతున్నారు.
News July 8, 2025
ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం శోచనీయం: హరీశ్ రావు

ఉపాధి హామీ ఏపీఓలకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం శోచనీయమని ప్రభుత్వంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మనోవేదనకు గురై ఉపాధి హామీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం విచారకరమన్నారు. ఉపాధి హామీ సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే వేతనాలు చెల్లించాలని “X” వేదికగా డిమాండ్ చేశారు.