News July 4, 2025

జగిత్యాల: ‘వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి’

image

వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్ పెడ్ మా కే నామ్‘ ( మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో శుక్రవారం అయన ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సహకార సంఘాల పరిధిలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు.

Similar News

News July 5, 2025

HYD: ప్రైవేటు బడి పుస్తకాలతో.. భుజం బరువెక్కుతుంది.!

image

HYDలో కొన్ని ప్రైవేటు పాఠశాలల వ్యవహారంతో బడి పుస్తకాలు మోతకోలుగా మారుతున్నాయి. పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ప్రాక్టీస్ నోట్స్, సబ్జెక్టు మెటీరియల్ ఇలా రకరకాల పేర్లతో పిల్లల భుజాలకు కిలోల బరువును వేలాడేస్తున్నారు. దీంతో పిల్లల భుజం బరువెక్కుతోంది. సాధారణంగా ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు, నోట్స్ సరిపోతుంది. మరీ మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది.

News July 5, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News July 5, 2025

ఓదెల: ప్రభుత్వ పాఠశాలల ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

image

ఓదెల మండలంలోని పాఠశాలల పనితీరుపై కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెడ్‌మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వార్షిక ప్రణాళికను అమలు చేయాలని, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మ్యాథ్స్, ఆంగ్లం, తెలుగు విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి సారించాలని అన్నారు. టీచర్ల హాజరు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయాలని, పాఠశాలల మౌలిక వసతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని, హాజరును 60%కి పెంచాలని ఆదేశించారు.