News March 28, 2025

జగిత్యాల: వరి కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలి

image

రాబోయే యాసంగికి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ బిఎస్.లత అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు కమిటీ సభ్యులతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కేంద్రాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్ కనెక్షన్, ఆన్‌లైన్ వసతి ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు మిల్లుకు వచ్చిన లారీని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని సూచించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 31, 2025

BHPL: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం (UPDATE)

image

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో ఇది 3వ ప్రభుత్వ ఉద్యోగంగా సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.

News March 31, 2025

నిజామాబాద్ జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు: కలెక్టర్

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

News March 31, 2025

మడకశిరలో పర్యటించిన సత్యసాయి జిల్లా ఎస్పీ

image

మడకశిర పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆత్మహత్య చేసుకున్న గృహాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

error: Content is protected !!