News February 28, 2026
జగిత్యాల: వసతి గృహ సంక్షేమ అధికారుల డైరీ ఆవిష్కరణ

జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డైరీని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జి.సునీతతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ ఎండీ సాజిద్ బాబా, సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాస్ నాయక్, సెక్రటరీ వి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 1, 2026
సిద్దిపేట: ప్రేమను నిరాకరించడంతో బాలిక సూసైడ్!

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ప్రేమ వ్యవహారం ఓ బాలిక ప్రాణం తీసింది. యువతి అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించగా, వరుసకు అన్నాచెల్లెలు కావడంతో పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన బాలిక FEB 23న పురుగుల మందు తాగింది. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2026
దేవాలయాల పాలకవర్గాలకు నోటిఫికేషన్

దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న NKP, CTL మండలాల్లోని పలు దేవాలయాలకు పాలకవర్గాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించారు. NKP మండలంలో NKP ఆంజనేయ స్వామి, వేణుగోపాల స్వామి, రామలింగేశ్వరస్వామి, ఎం.ఎడవెల్లిలోని హనుమాన్, షాపల్లిలోని లక్ష్మీ నరసింహస్వామి, మాండ్రలోని శ్రీ ఆంజనేయస్వామి CTL మండలం పేరుపల్లి సీతారామచంద్రస్వామి దేవాలయ పాలకవర్గాల ఎంపికకు నోటిఫికేషన్ విడుదలైంది.
News March 1, 2026
జగిత్యాల: నేడే ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష

జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్‌లో అందించే ఐదు నెలల ఉచిత శిక్షణ కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డైరెక్టర్ నరేశ్ తెలిపారు. ఈరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జగిత్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ & పీజీ కాలేజీలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్, ఆధార్ కార్డు, బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో హాజరుకావాలని సూచించారు.


