News April 5, 2025

జగిత్యాల వాసులూ.. అప్లై చేశారా..?

image

నిరుద్యోగుల కోసం రాజీవ్ యువవికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 14 వరకు గడువుంది. జూన్ 2 నుంచి 9 వరకు అర్హులకు మంజూరు పత్రాలు ఇస్తారు. లబ్ధిపొందిన వారికి నెల రోజులు శిక్షణ ఇవ్వనున్నారు. ఆధార్, రేషన్ కార్డ్, క్యాస్ట్ & ఇన్‌కమ్ సర్టిఫికెట్స్‌తో ఆన్‌లైన్‌లో అప్లై చేసి హార్డ్ కాపీలను జగిత్యాల జిల్లాలోని స్థానిక MPDO ఆఫీస్‌లో ఇవ్వాలి. SHARE

Similar News

News April 5, 2025

MDCL: ఇంటి వద్దనే టీకా..ఎందుకలా..?

image

గ్రేటర్ హైదరాబాద్‌లో అనేక మంది 15 ఏళ్లలోపు పిల్లలకు అందించాల్సిన టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని టీకాలు తీసుకుని కొన్ని నెలల తర్వాత మానేస్తున్నారని వైద్య బృందం గుర్తించింది. దీంతో పిల్లలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని గమనించి, ఇక లాభం లేదని గుర్తించి, పిల్లల ఇంటికే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 5, 2025

CSKvsDC: టాస్ గెలిచిన ఢిల్లీ.. జట్లు ఇవే

image

CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
CSK: రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్, విజయ్ శంకర్, జడేజా, ధోని, అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్, మతీషా పతిరణ
DC: మెక్‌గర్క్, KL రాహుల్, పోరెల్, స్టబ్స్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రజ్, స్టార్క్, కుల్దీప్, మోహిత్ శర్మ

News April 5, 2025

ఈ అవార్డు భారతీయులకు అంకితం: మోదీ

image

శ్రీలంక తనకు ప్రదానం చేసిన అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ’ను 140 కోట్ల భారతీయులకు అంకితం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. శ్రీలంక అధ్యక్షుడు అనుర దిసనాయకే చేతుల మీదుగా ఆయన అవార్డును స్వీకరించారు. ఈ పురస్కారానికి ఎంపిక చేసినందుకు శ్రీలంక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు రక్షణ రంగానికి సంబంధించి పలు ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు MoU కుదుర్చుకున్నారు.

error: Content is protected !!