News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

ధర్మపురి మైనారిటీ కాలేజీలో కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ. సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Similar News
News July 4, 2025
ఇబ్రహీంపట్నం: ‘నేరాల నివారణే లక్ష్యంగా పనిచేయండి’

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పలువురు అధికారులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, పోలీస్ స్టేషన్ లోని పరిసరాలను, నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ రాములు, సీఐ అనిల్ కుమార్, ఎస్సై అనిల్ తదితరులు పాల్గొన్నారు.
News July 4, 2025
సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు: కలెక్టర్

సమాజంలోని అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్లబ్‌లో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పాల్గొన్నారు. దివ్యాంగుల అవసరాలను తీర్చడంలో సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుందన్నారు. సామాజిక సంక్షేమం పట్ల ఎస్పీఎం యాజమాన్యం తీరును అభినందించారు.
News July 4, 2025
నల్గొండ: మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన

IPR సెల్ MGU నల్గొండ, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ, TG స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడారు. విద్యార్థులు వినూత్న ఆలోచన, ఆచరణాత్మక దృక్పథానికి, క్రమశిక్షణ తోడైతే ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలుగా ఎదిగి పేటెంట్ సాధించడం సులువు అని అన్నారు.