News February 1, 2025

జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

image

జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో 5గురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.

Similar News

News February 1, 2025

కరీంనగర్: నిర్మలమ్మ పద్దుపైనే ఆశలు..!

image

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శనివారం లోకసభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై KNR జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తి, కరీంనగర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజు నడిచే విధంగా చర్యలు, జిల్లాలో భారత్ మాల పథకంలో జాతీయ రహదారుల విస్తరణ, జమ్మికుంట రైల్వే స్టేషన్‌లో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ కల్పించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

News January 31, 2025

కరీంనగర్: ముగిసిన రోడ్డు భద్రత మాసోత్సవాలు

image

వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రాణాలు కాపాడుకోవాలని కరీంనగర్ జిల్లా పమేలా సత్పతి అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం ముగింపు కార్యక్రమం సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నగరంలో హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రతినెల అవగాహన కల్పించాలని రవాణాశాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఇందుకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు.

News January 31, 2025

చొప్పదండి: రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

చొప్పదండి నవోదయ స్కూల్ వద్ద శుక్రవారం జరిగిన బైక్ ప్రమాదంలో ధర్మపురికి చెందిన పసుపునుటి భారతి (60) అనే మహిళ మృతి చెందింది. భారతి తన కుమారుడు చంద్రశేఖర్ తో కరీంనగర్ వైపు బైక్‌పై వస్తుండగా హఠాత్తుగా మేక అడ్డు రావడంతో సడేన్ బ్రేకు వేశాడు. దీంతో రోడ్డుపై పడిన భారతికి తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. చొప్పదండి ఎస్‌ఐ గొల్లపల్లి అనూష కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.