News February 1, 2025
జగిత్యాల: విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్
జగిత్యాల జిల్లా ధర్మపురి మైనారిటీ కాలేజీలో వాంతులు, విరేచనాలతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడంపై జిల్లా కలెక్టర్ బీ.సత్యప్రసాద్ స్పందించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వాస్పత్రిలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడిన తరువాత జగిత్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అబ్జర్వేషన్ అనంతరం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.
Similar News
News February 1, 2025
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు వివరాలిలా.. చౌటుప్పల్ పట్టణానికి చెందిన మహ్మద్ నన్నేసాబ్ (33) ఇటీవల భువనగిరి బై పాస్‌లోని నల్గొండ ఫ్లై ఓవర్ సమీపంలోన రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
News February 1, 2025
బుచ్చిలో YCPకి గట్టి షాక్
బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ మాజీ వైస్‌ఛైర్మన్, 19వ డివిజన్ కౌన్సిలర్ కోటంరెడ్డి లలితమ్మ ఆమె భర్త శ్రీకాంత్ రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు వారు TDP తీర్థం పుచ్చుకున్నారు. మూడో తేదీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎంపిక జరగనున్న నేపథ్యంలో పలువురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరటం చర్చనీయాంశమైంది. బుచ్చి వైసీపీ కన్వీనర్ మల్లికార్జున్ రెడ్డి కూడా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే.
News February 1, 2025
వికారాబాద్: రిటైర్డ్ టీచర్ రామస్వామి మృతి
ఉత్తమ ఉపాధ్యాయుడిగా సేవలు అందించిన కొత్తపేట రామస్వామి మృతిచెందడం చాలా బాధాకరమని కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజేశ్వరమ్మ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో రిటైర్ టీచర్ కొత్తపేట రామస్వామి అనారోగ్యంతో మృతిచెందగా రాజేశ్వరమ్మ పరామర్శించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. రాజేశ్వరమ్మ మాట్లాడుతూ.. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.