News December 31, 2025

జగిత్యాల: విద్యా దీవెన దరఖాస్తులు మార్చి 31 వరకు

image

జగిత్యాల జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి SC, ST, BC, OC, మైనారిటీ విద్యార్థుల విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులపై జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుల చివరి తేదీ 31 మార్చి 2026 కాగా, దరఖాస్తులు E-PASS వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.

Similar News

News February 22, 2026

ఉమ్మడి తూ.గో జిల్లాకు మరో ఎయిర్‌పోర్టు

image

రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 9 ఎయిర్‌పోర్టులు నిర్మించే ప్రణాళికలో భాగంగా కాకినాడ జిల్లా తుని – అన్నవరం మధ్య విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపింది. తొలుత కరప మండలం గురజానాపల్లిలోని సాల్ట్ భూములను పరిశీలించినా, సాంకేతిక కారణాలతో తుని ప్రాంతాన్ని ఎంపిక చేస్తూ డీపీఆర్ సిద్ధం చేశారు. ఇక్కడ భూసేకరణ వల్ల ఆర్థిక భారం పడినా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఇక్కడే నిర్మాణానికి అంగీకరించింది.

News February 22, 2026

కుండలు అమ్మే వ్యక్తికి ₹1.25 కోట్ల GST నోటీస్

image

రాయ్‌బరేలీ(UP)కి చెందిన సయీద్ అనే వ్యక్తి ₹2 విలువ చేసే చిన్న కుండలు అమ్ముతూ జీవిస్తున్నారు. ఆయనకు ఏకంగా ₹1.25 కోట్ల GST నోటీసు రావడం చూసి అవాక్కయ్యారు. ఆయన పేరిట 4 కంపెనీలు నడుస్తున్నట్లు వాటిలో ఉంది. గతంలో లోన్ కోసం ఆధార్, పాన్ కార్డులు ఇస్తే.. వాటిని ఎవరో కేటుగాళ్లు తప్పుడు వ్యాపారాలకు వాడినట్లు తెలుస్తోంది. కడు పేదరికంలో ఉన్న సయీద్.. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు.

News February 22, 2026

అన్నమయ్య: ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్

image

ఈ నెల 23 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్నమయ్య జిల్లాలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP ధీరజ్ తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలని యాజమాన్యాలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.