News October 12, 2025
జగిత్యాల: విద్యా, వైద్యం ప్రభుత్వ బాధ్యత: ఎమ్మెల్సీ

జగిత్యాల పట్టణంలోని మిలాత్ ఇస్లామియా కమిటీ సభ్యులు ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యా, వైద్యం రెండూ ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం ఎంత చేసినప్పటికీ, సామాజిక సేవలు కూడా అవసరమన్నారు. ప్రభుత్వపరంగా పొందలేని సేవలను ఆరోగ్యశ్రీ ద్వారా పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 12, 2025
అంతరిక్షం నుంచి హిమాలయాల అందాలు!

నాసా వ్యోమగామి డాన్ పెట్టిట్ అంతరిక్షం నుంచి తీసిన హిమాలయ పర్వతాల ఫొటో SMలో వైరల్ అవుతోంది. తెల్లటి మంచు, మేఘాలతో కనుచూపు మేర ఉన్న పర్వతాలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ ఫొటోలో హిమాలయాలతో పాటు ఎవరెస్ట్ పర్వతం, నేపాల్ భూభాగం సైతం కనిపిస్తోందని వ్యోమగామి వెల్లడించారు. ఇటీవల బిహార్‌లోని జైనగర్ నుంచి ఎవరెస్టు పర్వత అందాలు కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.
News October 12, 2025
TPG: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

తాడేపల్లిగూడెం (M) ఎల్.అగ్రహారం జాతీయ రహదారి డివైడర్‌పై ఏలూరు వైపు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు రూరల్ పోలీసులు ఆదివారం తెలిపారు. మృతుడు కోల ముఖం కలిగి టీ-షర్టు, షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944796612, 9441834286ను సంప్రదించాలన్నారు.
News October 12, 2025
వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో మ్యాచ్

వాల్తేర్ రైల్వే క్రికెట్ స్టేడియంలో ఆదివారం డీఆర్ఎం వాల్తేర్ XI వర్సెస్ నేవీ XI మ్యాచ్ మ్యాచ్ జరిగింది. రెండు జట్లు నైపుణ్యం, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాయి. ఈ మ్యాచ్‌లో నేవీ XI మొదట బాటింగ్ చేసి 20 ఓవర్లకు 133 రన్స్ చేసింది. ఛేదనలో డీఆర్ఎం వాల్తేర్ XI 17 ఓవర్లలో 134 రన్స్ చేసి మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ భారత రైల్వే, నౌకాదళం మధ్య సంబంధాలను బలోపేతం చేసిందని రెండు వర్గాల అధికారులు పేర్కొన్నారు.