News December 19, 2025

జగిత్యాల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షునిగా సంకోజి వెంకటరమణ ఏకగ్రీవం

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీకేబి హాల్లో జరిగిన విశ్వబ్రాహ్మణ సంఘం సర్వసభ సమావేశంలో జగిత్యాల పట్టణ శ్రీ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా నాలుగోసారి ఏకగ్రీవంగా సంకోజు వెంకటరమణను ఎన్నుకున్నారు, శుక్రవారం ఏర్పాటుచేసిన సర్వసభ సమావేశంలో అందరి సభ్యుల ఏకగ్రీవ తీర్మానంతో రమణను ఎన్నుకోవడం జరిగిందని, అతని సేవకు ఇది నిదర్శనమని జిల్లా అధ్యక్షుడు టీవీ సత్యం తెలిపారు.

Similar News

News December 21, 2025

సిరిసిల్ల: ఎన్నికల విజయవంతంపై కలెక్టర్‌కు శుభాకాంక్షలు

image

గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా జిల్లాలోని ఎంపీడీవోలు, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఇన్చార్జి కలెక్టర్ ను వారు మర్యాదపూర్వకంగా కలిశారు.

News December 21, 2025

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు సిరిసిల్లలో నిరసన

image

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 21వ తేదీ ఆదివారం సిరిసిల్లలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసన తెలియజేస్తామని, జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ కోరారు.

News December 21, 2025

రవితేజ కీలక నిర్ణయం!

image

వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ‘మాస్ మహారాజా’ ట్యాగ్‌ను ఉపయోగించవద్దని సూచించినట్లు డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించారు. మరోవైపు ఈ మూవీకి ఇప్పటివరకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత సైతం వెల్లడించారు. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ మూవీ రవితేజకు హిట్టు లోటు తీరుస్తుందేమో చూడాలి.