News March 21, 2025

జగిత్యాల: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

10వ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. పరీక్షలను నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం సజావుగా నిర్వహించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా సూచించారు. ప్రశ్న పత్రాల తరలింపు సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News December 30, 2025

ధనుర్మాసం: పదిహేనో రోజు కీర్తన

image

నిద్రిస్తున్న ఓ గోపికను మేల్కొల్పే క్రమంలో ఆమెకు, గోపికలకు మధ్య జరిగిన సంభాషణ ఇది. బయట వారు ‘లేత చిలుకా! ఇంకా నిద్రనా?’ అని ఆటపట్టిస్తే, ఆమె లోపలి నుంచే ‘నేను వస్తున్నా, అంత గొంతు చించుకోకండి’ అని బదులిస్తుంది. ‘నీ మాటకారితనం మాకు తెలుసు’ అని వారు గేలి చేస్తే, ఆమె వినమ్రంగా జవాబిస్తుంది. చివరకు కంసుడిని, కువలయాపీడమనే ఏనుగును సంహరించిన కృష్ణుడి గుణగానం చేయడానికి అందరూ కలిసి వెళ్తారు. <<-se>>#DHANURMASAM<<>>

News December 30, 2025

హమాస్‌కు నరకమే.. ట్రంప్ హెచ్చరికలు

image

ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ ఒప్పుకోకపోతే నరకం తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఆ సంస్థకు కొద్ది సమయం మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. ఆ ప్రాంతంలో శాశ్వత శాంతికి నిరాయుధీకరణ చాలా ముఖ్యమని చెప్పారు. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. తాము దాడులకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

News December 30, 2025

2025లో ఎన్ని డ్రంక్&డ్రైవ్ కేసులు నమోదయ్యాయంటే..!

image

రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 2025లో మొత్తం 10,833 డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. హెల్మెట్ వినియోగం, ఓవర్ స్పీడ్, మద్యం తాగి వాహనం నడిపడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.