News January 20, 2026
జగిత్యాల: వృద్ధుల వసతి భవన్, డే కేర్ సెంటర్ ప్రారంభం

జగిత్యాల జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్‌లో రూ.1.50 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ వృద్ధుల వసతి భవన్, అలాగే పట్టణ బైపాస్ రోడ్డులో డే కేర్ సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.
Similar News
News February 9, 2026
GWL: మహాశివరాత్రికి స్పెషల్ బస్సులు: DM సునీత

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గద్వాల నుంచి శ్రీశైలం, అలంపూర్ పుణ్యక్షేత్రాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు గద్వాల డిపో మేనేజర్ సునీత సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 14న శ్రీశైలానికి 10 బస్సులు, 15న 20 బస్సులు,16న 10 బస్సులు నడుపుతామన్నారు. అలాగే అలంపూర్‌కు 14న 6 బస్సులు, 15న 10 బస్సులు, 16న 6 బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అవకాశాన్ని నడిగడ్డ భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News February 9, 2026
NZB: రంజాన్ ఉపవాస దీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: Adtl. కలెక్టర్

రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వమించారు. రంజాన్ ఉపవాస దీక్షలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
News February 9, 2026
5 పరుగుల తేడాతో 6 వికెట్లు డౌన్!

T20WC: స్కాట్లాండ్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 134 రన్స్‌కే ఆలౌటైంది. 129-134 రన్స్ మధ్య 6 వికెట్లు కోల్పోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. మరోవైపు ఓపెనర్లు సైతం శుభారంభం అందించలేదు. బెన్ మనేంటి ఒక్కరే హాఫ్ సెంచరీ(52)తో రాణించారు.


