News October 16, 2025

జగిత్యాల వైద్య కళాశాల సిబ్బందికి సీపీఆర్‌పై అవగాహన

image

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల సిబ్బందికి సీపీఆర్‌పై వైద్య కళాశాల వైద్యులు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సీపీఆర్ చేయడం వలన మానవ శరీరంలో జరిగే మార్పులను వివరించారు. గుండెపోటు వచ్చిన వారికి సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలు కాపాడిన వారు అవుతారని అన్నారు. కళాశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 16, 2025

పటాన్ చెరు: పోషకాహారం అందించేందుకే పోషన్ అభియాన్: కలెక్టర్

image

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకే పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. పటాన్ చెరులో పోషన్ అభియాన్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.

News October 16, 2025

రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

image

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు(శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇంఛార్జి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 10:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. అనంతరం అధికారులతో నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

News October 16, 2025

నేర దర్యాప్తులో ఆధారాలు కీలకం: CP సునీల్ దత్

image

నేర దర్యాప్తులో ఆధారాలు చాలా కీలమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయ ఆవరణలో గల భవనంలోని ఆధునికరించిన ఫింగర్ ఫ్రింట్ యూనిట్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేర పరిశోధనలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ, ఫింగర్ ఫ్రింట్ యూనిట్లలోని కార్యాచరణను వేగవంతం చేయడానికి ఆటోమేటెడ్ సిస్టమ్లను ఉపయోగిస్తున్నారని అన్నారు.