News November 12, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలు ఇలా

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,151, కనిష్ఠ ధర రూ.1,641; వరి ధాన్యం(1010) గరిష్ఠ ధర రూ.1,980, కనిష్ఠ ధర రూ.1,815; వరి ధాన్యం(HMT) ధర రూ.2,055; వరి ధాన్యం(JSR) గరిష్ఠ ధర రూ.2,700, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News November 12, 2025
మోదీ తల్లి పాత్రలో రవీనా టాండన్!

ఉన్ని కృష్ణన్ ప్రధాన పాత్రలో ప్రధాని మోదీ బయోపిక్ ‘మావందే’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన తల్లి హీరాబెన్ పాత్రలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ నటిస్తున్నారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. రవీనా KGF 1, 2లో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో తదితర చిత్రాల్లోనూ ఆమె నటించారు.
News November 12, 2025
జగిత్యాల: ముద్రా లోన్ ద్వారా 34,249 మందికి రూ.285 కోట్ల లబ్ధి

జగిత్యాల కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా దిశా కమిటీ సమావేశం జరిగింది. ముద్రా లోన్ పథకంలో జిల్లాకు రూ.285 కోట్లు మంజూరై 34,249 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందారని అధికారులు తెలిపారు. రూ.50వేల నుంచి రూ.20లక్షల వరకు జామీను లేకుండా లోన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కొంతమంది సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం వల్ల తిరస్కరణలకు గురవుతున్నారని తెలిపారు.
News November 12, 2025
జగిత్యాల: గొర్రెపల్లి శివారులో వ్యక్తి ఆత్మహత్య

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మంగళారపు లక్ష్మీనర్సయ్య(43) గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ భూమిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


