News December 30, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్ ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్‌కు గరిష్ఠ ధర రూ.1976, కనిష్ఠ ధర రూ.1976, వరి ధాన్యం 1010 గరిష్ఠంగా రూ.1950, కనిష్ఠ ధర రూ.1850, జైశ్రీరాం వరి ధాన్యం గరిష్ఠ ధర రూ.2711, కనిష్ఠ ధర రూ.2711 ధర పలికింది. నేడు మార్కెట్‌లో 32 బస్తాల కొనుగోళ్లు జరిగినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
Similar News
News February 13, 2026
BREAKING: సంగారెడ్డి: కోహిర్‌లో హంగ్

సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 16 వార్డులు ఉండగా కాంగ్రెస్ 8, BRS 5,బీజేపీ 1, స్వతంత్రులు 2 గెలిచారు. కాగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో కోహిర్ మున్సిపల్ పీఠం ఆ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.
News February 13, 2026
మండలి నుంచి YCP వాకౌట్

AP: శాసన మండలి నుంచి YCP సభ్యులు వాకౌట్ చేశారు. విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండలిలో చెప్పారు. అధికార పక్షం ఆరోపిస్తున్నట్లుగా వాకౌట్ చేయడం తమకు ఫ్యాషన్ కాదని, తమ నిరసన ద్వారా పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం, తద్వారా ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడమేనని వివరించారు.
News February 13, 2026
BREAKING: పాలమూరు: దేవరకద్రలో హంగ్

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 6, BRS 4, బీజేపీ 1, స్వతంత్రులు 1 గెలిచారు. కాగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలవడంతో దేవరకద్ర మున్సిపల్ పీఠం ఆ పార్టీకి దక్కే ఛాన్స్ ఉంది.


