News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News September 18, 2025
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట RTCలో ఉద్యోగాలు

సుదీర్ఘ విరామం తర్వాత<<17746081>> ఆర్టీసీలో ఉద్యోగాల<<>> భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి మెదక్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో సంగారెడ్డి జిల్లాలో 52, మెదక్, సిద్దిపేటలో ఒకటి చొప్పున డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 64, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేటలో 4 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
-SHARE IT
News September 18, 2025
OCT 7న HCU 25వ స్నాతకోత్సవం

అక్టోబర్ 7న HCU 25వ స్నాతకోత్సవాన్ని గచ్చిబౌలి శాంతి సరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు ఛాన్సిలర్ జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొంటారని, స్నాతకోత్సవంలో 1,700 మంది గ్రాడ్యుయేట్లకు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నారు.
News September 18, 2025
విశాఖలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్

విశాఖలో బుధవారం రాత్రి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. వన్ టౌన్, కంచరపాలెం, షీలా నగర్ ప్రాంతాల్లో ఒకే బ్యాచ్ ఏడు చైన్ స్నాచింగ్‌లు చేసి కలకలం సృష్టించింది. ఒకే బైక్ పై ఇద్దరు యువకులు ఈ ఏడు చోట్ల చోరీలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్‌తో స్నాచింగ్‌కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 చోట్ల జరిగిన స్నాచింగ్‌లో సుమారు 20 తులాల వరకు బంగారు ఉంటుందని చెబుతున్నారు.