News February 5, 2025
జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!
చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా ఉండేందుకు నరేశ్ నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
Similar News
News February 5, 2025
వివేకా హత్య కేసులో కీలక పరిణామం
AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్‌పై కేసులు నమోదయ్యాయి.
News February 5, 2025
విశాఖ డివిజన్ పరిధిలోకి వచ్చే రైల్వే లైన్లు ఇవే
➤ పలాస – <<15366937>>విశాఖపట్నం<<>> – దువ్వాడ
➤ కూనేరు – విజయనగరం
➤ నౌపడ – పర్లాకిముండి
➤ బొబ్బిలి – సాలూరు
➤ సింహాచలం నార్త్ – దువ్వాడ బైపాస్
➤ వడ్లపుడి – దువ్వాడ
➤ విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయ్యపాలెం
News February 5, 2025
హీరోపై కేసు నమోదు!
స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.