News January 10, 2026

జగిత్యాల: ‘సంక్రాంతి సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి’

image

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలకు వెళ్లే ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఈ సమయంలో దొంగతనాలు జరిగే అవకాశముందని, ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచాలని తెలిపారు. చోరీల నియంత్రణకు పోలీసు శాఖ చర్యలు చేపట్టిందని, రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేశామని పేర్కొన్నారు.

Similar News

News January 23, 2026

V2V కోసం 30 GHz కేటాయించిన కేంద్రం

image

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల ప్రకటించిన <<18808386>>V2V టెక్నాలజీ<<>> కోసం 30 GHz రేడియో ఫ్రీక్వెన్సీని కేటాయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. దీని ద్వారా వాహనాలు ఇంటర్నెట్‌ అవసరం లేకుండా నేరుగా భద్రతా సమాచారాన్ని పంచుకుంటాయి. అన్ని వైపుల నుంచి వచ్చే ప్రమాదాలను ముందే గుర్తించి హెచ్చరిస్తుంది. ఈ టెక్నాలజీ కోసం ఒక్కో వాహనానికి రూ.5,000-7,000 ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

News January 23, 2026

ఇషాన్ కిషన్ ఊచకోత.. రికార్డ్ బ్రేక్

image

రెండో టీ20లో భారత యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ న్యూజిలాండ్‌ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ఫోర్లు, సిక్సర్లతో ఊచకోత కోస్తున్నారు. ఈక్రమంలోనే 21 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదారు. దీంతో NZపై అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచారు. తొలి టీ20లో అభిషేక్ 22 బాల్స్‌లో ఈ ఫీట్ సాధించగా ఇషాన్ దాన్ని బద్దలుకొట్టారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో ఫిఫ్టీ చేశారు.

News January 23, 2026

విజయవాడ: LRS గడువు మరోసారి పొడిగింపు!

image

అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS) గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. ఎల్ఆర్ఎస్-2025 కింద రూ.10,000 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్ తెలిపారు. ఇప్పటికే దాదాపు 62 వేల దరఖాస్తులు అందాయని చెప్పారు. మధ్యవర్తులను నమ్మకుండా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.