News October 17, 2025
జగిత్యాల: సన్న/దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరు కేంద్రాలు

జగిత్యాల కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సమావేశం నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ప్రారంభించవద్దని, ప్రతి కేంద్రంలో అవసరమైన వస్తువులు సిద్ధం చేయాలని సూచించారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యానికి వేర్వేరు కేంద్రాలు, ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రవాణాను వేర్వేరు నిర్వహించి రైతులకు స్పష్టత కల్పించాలని అన్నారు.
Similar News
News October 17, 2025
నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.
News October 17, 2025
ములుగుకు కేంద్రీయ విద్యాలయం మంజూరు: ఎంపీ

ములుగుకు ప్రతిష్ఠాత్మకమైన కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తెలిపారు. ములుగు ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ విద్యాలయాన్ని మంజూరు చేయించినట్లు తెలిపారు. మోడికుంటవాగు ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. ట్రైబల్ సెంట్రల్ వర్సిటీ పనులను వేగవంతం చేయిస్తామని చెప్పారు.
News October 17, 2025
SRCL: ‘అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి’

నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు అక్షరాస్యతపై తప్పనిసరిగా అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం. హరిత ఆదేశించారు. అండర్ స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ (ఉల్లాస్) కార్యక్రమంపై జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, మెప్మా శాఖ అధికారులతో శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఆమె సమీక్ష నిర్వహించారు. లక్ష్యాలను చేరే దిశగా పనిచేయాలని అధికారులకు సూచించారు.