News September 7, 2025

జగిత్యాల: ‘సర్వేపల్లి రాధాకృష్ణను స్ఫూర్తిగా తీసుకోవాలి’

image

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ సేవాగుణం, అంకితభావం, విలువలు, నైపుణ్యతను ఉపాధ్యాయులు స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల అందజేత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు వచ్చే వేతనంలో 75% పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందించే వారన్నారు. భారత ఉపరాష్ట్రపతిగా ఆయన సేవలందించారన్నారు.

Similar News

News September 8, 2025

కలికిరికి మాజీ సీఎం రాక నేడు

image

మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలికిరికి ఇవాళ రానున్నారు. రెండు రోజులు ఇక్కడే బస చేస్తారని ఆయన పీఏ కృష్ణప్ప తెలిపారు. సోమ, మంగళవారాల్లో లోకల్‌గా జరిగే పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ వెళ్తారన్నారు.

News September 8, 2025

లిక్కర్ కేసు నిందితులకు నోటీసులు!

image

AP: లిక్కర్ కేసులో ముగ్గురు నిందితులకు ACB కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్ హైకోర్టులో సవాలు చేసింది. విచారణ చేపట్టిన HC బెయిల్‌పై విడుదలైన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ACB కోర్టు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడం చట్ట విరుద్ధమని సిట్ తరఫు న్యాయవాది వాదించారు. మిగిలిన నిందితులకు ఇలా బెయిల్ ఇవ్వొద్దని కోరారు. తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది.

News September 8, 2025

HYD: అటు ఆనందం, ఇటు ఆర్తనాదం

image

అందరిదేమో ఆనందం.. కొందరిదేమో ఆర్తనాదం. బొమ్మ బొరుసు వలే ఈ రెండు ఉంటాయనడానికి పైఫొటో ఉదాహరణ. ఆదివారం ట్యాంక్‌బండ్‌ మీద నిమజ్జనోత్సవంలో కొన్ని దృశ్యాలు ఉత్సాహం నింపితే, మరికొన్ని గుండెను బరువెక్కించాయి. ఆటపాటల్లో మునిగిన సెక్రటేరియట్ ఎదుట మాసిపోయిన చీర, ఒంటినిండా గాయాలతో ఓ తల్లి భిక్షాటన చేసింది. దిక్కుతోచని స్థితిలో ఆ బాలుడు దీనంగా చూస్తుండిపోయాడు. వారి బతుకు చిత్రం చూసి భక్తులు చలించిపోయారు.