News September 2, 2025

జగిత్యాల: ‘సీఎం రేవంత్ రెడ్డితో తాడోపేడో తేల్చుకుంటాం’

image

CM రేవంత్ రెడ్డితో పెన్షన్ల పెంపు విషయంలో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సెప్టెంబర్ 9న నిర్వహించనున్న చలో హైదరాబాద్ సదస్సును లక్షలాదిమంది పెన్షన్ దారులు తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. JGTL(D) రాయికల్ పట్టణంలోని ఓ గార్డెన్‌లో సోమవారం పెన్షన్‌దారులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని మందకృష్ణ డిమాండ్ చేశారు.

Similar News

News September 4, 2025

విద్యార్థుల హాజరుపై సమీక్షించాలి: అదనపు కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుపై మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు సమీక్షించాలని ASF అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. 50 శాతం మంది విద్యార్థులు పాఠశాలలకు రావడం లేదని, దీనికి గల కారణాలను తెలుసుకోవాలని ఆదేశించారు.

News September 4, 2025

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

నర్సాపూర్లోని రాయరావుచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. గణనాథుల నిమజ్జనానికి తరలివచ్చే సమయంలో భక్తులకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమై తెలియజేయాలని పుర కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మైపాల్, తహశీల్దార్ శ్రీనివాస్, నీటిపారుదలశాఖ మండల అధికారి మణిభూషణ్, మునిసిపల్ సిబ్బంది, తదితరులున్నారు.

News September 4, 2025

GWL: డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ముస్తాబు చేయాలి

image

గద్వాల్ శివారులోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ముస్తాబు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈనెల 6న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎంపికైన 715 మంది లబ్ధిదారులు కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రారంభోత్సవానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి హాజరవుతారని చెప్పారు.