News July 10, 2025
జగిత్యాల: సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణమూర్తి

జగిత్యాలలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎం.జి.కృష్ణమూర్తి గురువారం బాధ్యతలను స్వీకరించారు. కొన్ని రోజులుగా ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ సుమన్‌రావు వ్యవహరించారు. గాంధీ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కృష్ణమూర్తిని జగిత్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Similar News
News July 11, 2025
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సత్య శారద ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో అన్ని మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల, రేషన్ కార్డుల వేరిఫికేషన్, భూ భారతి దరఖాస్తుల పరిస్కారం, వనమహోత్సవంలో నాటిన మొక్కలు, సీజనల్ వ్యాధులపై సమీక్షించారు.
News July 11, 2025
NZB: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి 7 రోజుల జైలు: SHO

మద్యం అతిగా సేవించి రైల్వే స్టేషన్ ఏరియాలో న్యూసెన్స్ చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించిన షేక్ ఫెరోజ్ (30) అనే వ్యక్తికి 7 రోజుల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి గురువారం తీర్పు చెప్పారని NZB వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మగడమునగర్‌కు చెందిన షేక్ ఫెరోజ్ బుధవారం రాత్రి రైల్వే స్టేషన్ వద్ద అతిగా మద్యం సేవించి హంగామా చేశాడన్నారు.
News July 11, 2025
నాకు ప్రాణ హాని ఉంది: ట్రంప్

ట్రంప్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్ సీనియర్ అధికారి <<17014894>>జావద్ లారిజనీ<<>> చేసిన హెచ్చరికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘జావద్ లారిజనీ హెచ్చరికలను బెదిరింపులుగానే భావిస్తున్నాను. నా ప్రాణాలకు హాని ఉంది అనే వార్తల్లో సందేహం లేదు. నిజానికి నేను ఏడేళ్ల వయసు నుంచే సన్ బాత్ చేయడం మానేశాను’ అని వ్యాఖ్యానించారు. ఆ సమాధానం చూస్తే ఇరాన్ హెచ్చరికలను ట్రంప్ తేలిగ్గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.