News January 10, 2026
జగిత్యాల: సెర్ప్ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

జగిత్యాల జిల్లా కేంద్రంలోని సెర్ప్ కార్యాలయంలో ఉద్యోగుల సంక్షేమ సంఘం సమావేశం శుక్రవారం నిర్వహించారు. సమావేశానంతరం నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా డా.మెట్టు దాసు, ప్రధాన కార్యదర్శిగా సంఘ రత్నాకర్, కోశాధికారిగా కోల సత్యనారాయణ, ఇతర సంఘ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మెట్టు దాసు మాట్లాడుతూ.. ఉద్యోగుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు.
Similar News
News February 13, 2026
టెన్త్, ఇంటర్ పరీక్షలకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్

జిలాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌కి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి విజయానంద్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈనెల 23 నుంచి ఇంటర్, మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News February 13, 2026
కొత్తగూడెంలో కొత్త కార్పొరేటర్ ‘కిడ్నాప్’ కలకలం..!

కొత్తగూడెం మేయర్ పీఠం దక్కించుకునే క్రమంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 32వ డివిజన్ నుంచి BRS తరఫున గెలిచిన కార్పొరేటర్ గుగులోత్ రాంబాబును కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లారని బీఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు రాంబాబు ఇంటి వద్ద ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
News February 13, 2026
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.


