News March 14, 2025

జగిత్యాల: హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు అదనపు కలెక్టర్ బి.ఎస్‌లత తో కలిసి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్ దంపతులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిల్లలకి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ పాల్గొన్నారు.

Similar News

News February 19, 2026

VJA: బ్యాంకు ఒప్పంద ఉద్యోగుల చేతివాటం.. స్కాముల్లోను వారే!

image

విజయవాడలోని బ్యాంక్ అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అక్రమాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల గవర్నర్‌పేటలోని ఓ బ్యాంక్ లాకర్లో రూ.50 లక్షల బంగారం మాయం కాగా, సిబ్బంది గుట్టుగా రికవరీ చేశారు. మరోవైపు సైబర్ నేరాలకు వాడే ‘మ్యూల్ ఖాతాల’ వెనుక వీరి పాత్ర ఉండటంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఇప్పటికే ఏ4 నిందితుడిగా దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేయగా, పలువురు మేనేజర్లను పోలీసులు విచారిస్తున్నారు.

News February 19, 2026

NTR: ఎం.ఫార్మసీ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ పరిధిలోని కాలేజీలలో ఎం.ఫార్మసీ విద్యార్థులు Y25 బ్యాచ్(రెగ్యులర్) & Y22, Y23, Y24 బ్యాచ్‌లు(సప్లిమెంటరీ) రాయాల్సిన 1వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 30 నుంచి నిర్వహిస్తామని.. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా మార్చి 16లోపు, రూ.100 ఫైన్‌తో 17లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.

News February 19, 2026

మద్యం తాగి వాహనం నడిపితే జైలుకే

image

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. గత 2నెలల్లో నిబంధనలు ఉల్లంఘించిన 1,176మందికి కోర్టు శిక్షలు విధించగా, అందులో 222 మందికి జైలు శిక్ష పడింది. ఒకరికి నెల రోజులు, ఐదుగురికి 15రోజుల జైలు శిక్ష ఖరారైంది. రూ.14.87లక్షల జరిమానా వసూలు చేసినట్లు పోలీస్ శాఖ తెలిపింది. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.