News August 23, 2025
జగిత్యాల: 17 ఏళ్ల పురాతన కేసు పరిష్కారం

జగిత్యాల జిల్లా న్యాయస్థానంలో 17 సంవత్సరాల పురాతన సివిల్ కేసును రాజీకి సహకరించిన న్యాయవాదులను జిల్లా జడ్జి రత్న పద్మావతి అభినందించారు. ఈ సందర్భంగా వాది, ప్రతివాది న్యాయవాదులు మారిశెట్టి ప్రతాప్, మేట్ట మహేందర్, బార్ ప్రెసిడెంట్ శ్రీరాములు ప్రత్యేక చొరవ వల్లే సాధ్యమైనట్లు జడ్జి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ఎస్ నారాయణ, వెంకట మాలిక్ శర్మ న్యాయవాదులు పాల్గొన్నారు.
Similar News
News August 23, 2025
మెదక్: నాడు విద్యార్థి.. నేడు గెజిటెడ్ హెచ్ఎం

మెదక్ మండలం మాచవరం ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలుగా వై. సుకన్య శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. హవేలిఘనపూర్ మండలం కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆమె పదోన్నతిపై వెళ్లారు. అయితే ర్యాలమడుగు గ్రామానికి చెందిన సుకన్య మాచవరం పాఠశాలలోనే చదువుకున్నారు. అదే పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టడం విశేషం.
News August 23, 2025
మట్టి గణపతిని పూజించండి: కలెక్టర్ ప్రావీణ్య

వినాయక నవరాత్రి వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. చెరువులు కలుషితం కాకుండా మట్టి వినాయక విగ్రహాలని పూజించాలని సూచించారు. పోలీసు అధికారుల సూచనలు నిర్వాహకులు పాటించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
News August 23, 2025
ములుగు జిల్లా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ములుగు జిల్లాలో నిరుద్యోగ యువతకు SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా 18-45 ఏళ్ల ఉన్న నిరుద్యోగ యువతకు హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేర్‌లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఈ శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు వరంగల్ జిల్లా హసన్‌పర్తి పోలీస్ స్టేషన్ సమీపంలోని కార్యాలయంలో ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ సూచించారు.