News March 19, 2025

జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్‌కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News March 19, 2025

కందుకూరు యువకుడికి గేట్‌లో మొదటి ర్యాంక్

image

గేట్ ఫలితాలు నేడు వెలువడిన విషయం తెలిసిందే. అందులో ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరుకి చెందిన సాదినేని నిఖిల్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. అతని తండ్రి శ్రీనివాసులు కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. నిఖిల్ చెన్నై IITలో ఆన్‌లైన్ ద్వారా డేటా సైన్స్‌లో డిగ్రీ చేశాడు. అంతేకాకుండా ఇతను ఢిల్లీ ఎయిమ్స్‌లో MBBS పూర్తి చేశాడు.

News March 19, 2025

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

image

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.

News March 19, 2025

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ కోమాలోకి బాలిక

image

టిక్‌టాక్ రీల్ అనుకరిస్తూ ఓ బాలిక కోమాలోకి వెళ్లింది. USలోని మిస్సోరి ఫెస్టస్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ(7) టిక్‌టాక్‌లో నీడో క్యూబ్‌ ఆకృతిని మార్చే రీల్ చూసింది. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకొని రీల్‌లో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి ఆపై ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటికి తీసినప్పుడు క్యూబ్‌ పేలి, అందులోని వేడి ద్రవం ఆమె ముఖం, ఛాతిపై పడింది. కొంత నోరు, ముక్కులోకి చేరడంతో కోమాలోకి వెళ్లింది.

error: Content is protected !!