News December 13, 2025

జగిత్యాల: 2499 మందికి నవోదయ పరీక్ష.. 1860 మంది హాజరు

image

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు. జగిత్యాలలో 4, మెట్పల్లిలో 2, కోరుట్ల, మల్యాల, ధర్మపురి, వెల్గటూరులో ఒక్కో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,499 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,860 మంది పరీక్షకు హాజరై 74.42 శాతం హాజరు నమోదు అయింది. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగాయి.

Similar News

News December 15, 2025

విశాఖ: టెట్ పరీక్షకు 10 మంది గైర్హాజరు

image

విశాఖలో సోమవారం రెండు కేంద్రాల్లో టెట్ పరీక్ష నిర్వహించినట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షల్లో 171 మంది అభ్యర్థులకు గానూ 161 మంది అభ్యర్థులు హాజరైనట్లు వెల్లడించారు. 10 మంది గైర్హాజరు అయ్యారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ ఒక పరీక్ష కేంద్రంను తనిఖీ చేశారు. ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో చెప్పారు.

News December 15, 2025

ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి

image

ఏలూరు జిల్లాలో సోమవారం సాయంత్రం విషాదం నెలకొంది. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 15, 2025

మెదక్: ‘3వ విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత’

image

మెదక్ జిల్లాలో జరగనున్న మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిందని ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో BNSS సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల భద్రతకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.