News February 24, 2025
జగిత్యాల: 48 గంటల పాటు మద్యం షాపులు బంద్

జగిత్యాల జిల్లాలో 48 మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని అన్ని మద్యంషాపులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు 25-02-2025 సాయంత్రం 4 గంటల నుంచి 27-02-2025 సాయంత్రం 4 గంటల వరకు మూసివేయాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News February 24, 2025
అర్జీలను నాణ్యతగా పరిష్కారించండి: సబ్ కలెక్టర్

ఆదోని సబ్ కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు పాల్గొని ప్రజల వినతి పత్రాలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్‌ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
News February 24, 2025
KCR, KTR ఎవరికి ఓటేస్తారు?: CM రేవంత్

TG: MLC ఎన్నికల్లో KCR, KTR, హరీశ్, కవిత సహా ఇతర BRS నేతలు ఎవరికి ఓటేస్తారని CM రేవంత్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో మాట్లాడుతూ ‘ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించాలని BRS నేతలు చెబుతున్నారు. వారు ఎవరిని గెలిపించడానికి ప్రయత్నిస్తున్నారో చెప్పాలి. ఉప ఎన్నికలు వస్తే గెలుస్తామని అంటున్న వాళ్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదు? కేసులకు భయపడి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు’ అని ఆరోపించారు.
News February 24, 2025
ఇస్రో నుంచి యువికా 2025 కు దరఖాస్తు చేసుకోండి

పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం పేరుతో యువిక -2025 కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. సోమవారం నుంచి మార్చి 23 దాకా రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించారు. 8వ తరగతి ఉత్తీర్ణులై 9వ తరగతి చదువుతున్న వారు అర్హులు. https//jigyasa.iirs.gov.in/yuvika అనే సైట్ లో అర్హత కలిగిన విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇస్రో కోరింది.