News October 19, 2025
జగిత్యాల: 6 నెలలుగా రేషన్ డీలర్లకు అందని కమీషన్

రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా వారికి రావలసిన కమీషన్ అందడం లేదు. జిల్లాలో 592 రేషన్ షాపులు ఉండగా.. మొత్తం 3,48,058 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందుకోసం దాదాపు 6500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. రేషన్ డీలర్లకు క్వింటాలు బియ్యానికి రూ.140 చొప్పున కమీషన్ ఇస్తుండగా, ఇందులో కేంద్రం రూ.90, రాష్ట్రం రూ.50 చెల్లిస్తోంది. అయితే గత మే నెల నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ రావడం లేదు.
Similar News
News October 19, 2025
సూర్యాపేట: చెరువులో పడి యువకుడి మృతి

మోతె మండలం మామిళ్లగూడెంలో ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జూలకంటి సురేందర్ రెడ్డి (34) శనివారం రాత్రి చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయాడు. సురేందర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News October 19, 2025
ఆర్మీలో 90 ఆఫీసర్ ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ జులై 2026లో ప్రారంభమయ్యే 55వ 10+2 TES కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ (M.P.C)లో 60% మార్కులతో పాసై, JEE మెయిన్స్-2025 అర్హత సాధించినవారు NOV 13వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా 90మందిని ఎంపిక చేస్తారు. 4ఏళ్ల ట్రైనింగ్ తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగం లభిస్తుంది.
News October 19, 2025
మా సాయాన్ని మరిచారు: అఫ్గాన్‌పై షాహిద్ అఫ్రీది ఫైర్

అఫ్గాన్‌పై పాక్ Ex క్రికెటర్ షాహిద్ అఫ్రీది ఫైరయ్యారు. తమ సాయాన్ని ఆ దేశం మరచిపోయినట్లుందని మండిపడ్డారు. ‘ఇలా జరుగుతుందని ఊహించలేదు. 50-60 ఏళ్లుగా వారిని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. నేను 350 అఫ్గాన్ ఫ్యామిలీస్‌కు సాయం చేస్తున్నా’ అని అన్నారు. రెండూ ముస్లిం దేశాలు కాబట్టి సహకరించుకోవాలన్నారు. పాక్‌లో టెర్రరిజం సాగిస్తున్న వారితో అఫ్గాన్ చేతులు కలపడం విచారకరమని పరోక్షంగా భారత్‌పై అక్కసువెళ్లగక్కారు.