News December 13, 2025
జగిత్యాల: 853 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు

జగిత్యాల జిల్లాలో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 1276 పోలింగ్ కేంద్రాలలో 134 సర్పంచ్, 946 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. ఎన్నికల విధుల్లో 853 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ సామగ్రిని పటిష్ట ఎస్కార్ట్‌తో తరలిస్తూ 57 రూట్లలో భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News December 14, 2025
నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. వెలుగోడు, గడివేముల, కొత్తపల్లి మండలాల్లో కొంతమేర ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.210, స్కిన్‌లెస్ రూ.220-250 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180 చొప్పున అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
News December 14, 2025
నా జీతాన్ని పేదలకు ఖర్చు చేయండి: నవీన్ పట్నాయక్

ఒడిశాలో MLAల జీతాలను <<18524281>>భారీగా<<>> పెంచిన నేపథ్యంలో మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనం, అలవెన్సులను పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయాలని సీఎం మోహన్ చరణ్‌కు లేఖ రాశారు. ‘25 ఏళ్లుగా ఒడిశా ప్రజల ప్రేమ, ఆప్యాయత, మద్దతు నాకు లభించింది. నా పూర్వీకుల ఆస్తిని కూడా 2015లోనే దానం చేశా. అదే స్ఫూర్తితో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా నాకు లభించే జీతభత్యాలను వదులుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
News December 14, 2025
కొండ చుట్టూ లోల్లులే!

ఒక లొల్లి పోగానే మరో లోల్లితో మంత్రి కొండా సురేఖ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నటుడు నాగార్జునతో గొడవ ముగిసిన తరుణంలో, KTR పరువు నష్టం కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. DCC అధ్యక్షుల నియామక విషయంలో ఇంట్లోనే భేదాభిప్రాయాలతో వరంగల్‌కు దూరంగా ఉంటుండగా, ముఖ్య అనుచరుడు నవీన్ రాజ్ రూపంలో మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. నమ్మిన రమేశ్ వైరి వర్గంలోకి మారడం, తోటి మంత్రులతో విభేదాలూ చర్చనీయాంశమయ్యాయి.


