News November 17, 2025
జగిత్యాల: EVMల గోదాంను తనిఖీ చేసిన కలెక్టర్

ధరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎంల గోదామును జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం తనిఖీ చేశారు. యంత్రాల భద్రత, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక వ్యవస్థలను ఈ సందర్భంగా ఆయన సమగ్రంగా పరిశీలించారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్టమైన భద్రత ఉండాలని, నిత్యం పర్యవేక్షణ కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవో మధుసూదన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 17, 2025
విద్యుత్ సామర్థ్యాన్ని పెంచడంలో గ్రీన్ స్టోరేజ్ కీలకం: కేంద్రమంత్రి

కర్నూలు జిల్లా పాగిడియాల మండలంలో గ్రీన్‌కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పవర్ పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులకు ప్రాజెక్టు పురోగతిపై ఆయన అవగాహన కల్పించారు. అవసరమైన విద్యుత్ నిల్వ సామర్థ్యాన్ని పెంచడంలో ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు.

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.