News December 27, 2025
జగిత్యాల: GO 252కు వ్యతిరేకంగా జర్నలిస్టుల ధర్నా

జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయం ముందు TUWJ H143 ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. GO 252 వల్ల జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జీవోను వెంటనే సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ జారీ చేయాలని కోరారు. ఫీల్డ్‌లో పనిచేసే విలేకరులను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులపై జరుగుతున్న వివక్ష అన్యాయమన్నారు.
Similar News
News December 28, 2025
చివరి గ్రీవెన్స్‌ను పబ్లిక్ సద్వినియోగం చేసుకోండి : జిల్లా ఎస్పీ

చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (PGRS) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత డీపీఓ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసేందుకు ఇది ఎంతగానో అనుకూలమైన కార్యక్రమం అన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి పీజీఆర్ఎస్.
News December 28, 2025
సంగారెడ్డి: 29, 31 తేదీల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 29, 31 తేదీల్లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. యూపీఎస్, హైస్కూళ్లలో పని చేసే సబ్జెక్టు ఉపాధ్యాయులకు కేటాయించిన పాఠశాలల్లో సమావేశాలకు హాజరుకావాలని చెప్పారు. ఈ సమావేశాలకు హాజరుకాని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 28, 2025
ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర పరిణామం

TG: ప్రహ్లాద్ పేరిట ఐబొమ్మ రవికి పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండటంపై పోలీసులు ఆరా తీశారు. అతడు తన రూమ్‌మేట్ అని గతంలో రవి చెప్పారు. దీంతో బెంగళూరు నుంచి ఇవాళ ప్రహ్లాద్‌ను పిలిపించి రవి ఎదుటే ప్రశ్నించారు. అయితే రవి ఎవరో తనకు తెలియదని, తన పేరుతో పాన్, లైసెన్స్ తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యానని ప్రహ్లాద్ చెప్పినట్లు తెలుస్తోంది. అతడి డాక్యుమెంట్లను రవి దొంగిలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


