News November 18, 2025
జగిత్యాల: KGBVలో దరఖాస్తుల ఆహ్వానం

రాయికల్ మండలం ఉప్పుమడుగు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్వీపర్ కం స్కావెంజర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి రాఘవులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రానికి చెందిన మహిళా అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై, 18-45 వయసు గలవారు అర్హులన్నారు. ఈనెల 19లోపు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణిని సంప్రదించి దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. SHARE IT.
Similar News
News November 18, 2025
కడియం శ్రీహరిపై అనర్హత వేటు? రాజకీయాల్లో వేడి!

BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది MLAలపై ఫిరాయింపు ఫిర్యాదును స్పీకర్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందులో స్టేషన్‌ఘన్పూర్ MLA కడియం శ్రీహరి కూడా ఉన్నారు. ఇప్పటికే పలువురిని పరిశీలించినప్పటికీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. రోజువారీ విచారణ జరిపి నాలుగు వారాల్లో నిర్ణయం ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నికతో సంభావ్యత పెరిగింది.

ఆయన ఆవిష్కరణలే ఆధునిక ఫోటోగ్రఫీకి బాట

ఫోటోగ్రఫీ పితామహుడిగా పేరుపొందిన లూయిస్ జాకస్ మండే డాగురే జన్మదినం నవంబర్ 18, 1787ను స్మరించుకుంటూ ప్రపంచం ఆయనను గుర్తుచేసుకుంది. డాగురే ఆవిష్కరించిన డాగురోటైప్ పద్ధతి ఆధునిక ఫోటోగ్రఫీకి బాట వేసింది. ఒకప్పుడు ఫోటోగ్రాఫర్ కి మాత్రమే పరిమితమైన కెమెరా, సాంకేతికత పెరిగి నేడు సామాన్యులు కూడా మొబైల్‌లు, కెమెరాలు వాడుతూ జ్ఞాపకాలను బంధించే ఈ ప్రపంచం ఆయన ప్రయోగాలపైనే నిలబడి ఉంది.