News September 10, 2025
జగిత్యాల: SEPT 13న జాతీయ మెగా లోక్ అదాలత్

ఈనెల 13న జాతీయ మెగా లోక్ అదాలత్ అన్ని కోర్టు ప్రాంగణాల్లో జరుగుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. క్రిమినల్, కంపౌండబుల్, సివిల్ తగాదా, ఆస్తి విభజన, కుటుంబపరమైన నిర్వహణ, వైవాహిక జీవితం, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టీ కేసులు, ఇతర రాజీ పడే కేసుల్లో కక్షిదారులు ఈ కార్యక్రమం ద్వారా రాజీకి రావాలని సూచించారు. రాజీ మార్గం రాజ మార్గమన్నారు.
Similar News
News September 10, 2025
విజయవాడలోని సీపెట్‌లో ఉద్యోగాలు

విజయవాడలోని <
News September 10, 2025
ALERT: ఈ-క్రాప్ బుకింగ్‌కు ఈ నెల 30 లాస్ట్

APలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే రాయితీలు, సున్నావడ్డీ రుణాలు, ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల కొనుగోలు, ఇతర సంక్షేమ పథకాలకు ఈ డేటానే ప్రామాణికం. అందువల్ల అన్నదాతలు ఈ నెల 30లోగా ఈ-క్రాప్ బుకింగ్ పూర్తిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు, భూమి, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్సులు, 1B తీసుకుని మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలి.
News September 10, 2025
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు లాభపడి 81,489 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు వృద్ధి చెంది 24,990 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. HCL టెక్, TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బెల్, L&T, కొటక్ బ్యాంక్, యాక్సిస్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సన్ ఫార్మా, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, ఎటర్నల్, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.