News April 7, 2024

జగ్గంపేట.. ఈ సారి ఎవరికి కంచు కోట..?

image

రాజకీయ ఉద్దండుల కోటగా పేరుగాంచిన జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లు గత ఆరేళ్లుగా భిన్న తీర్పును ఇస్తున్నారు. 1994 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. 1994, 1999లో టీడీపీ, 2004, 2009లో కాంగ్రెస్, 2014, 2019లో వైసీపీకి పట్టం కట్టారు. ఒక్కోపార్టీకి 2 సార్లు అవకాశం ఇస్తూ వచ్చిన జగ్గంపేట ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి మరి.
– మీ కామెంట్ ఏంటి..?

Similar News

News October 3, 2025

కొవ్వూరు: ‘గృహ నిర్మాణాలను వేగవంతం చేయండి’

image

కొవ్వూరు మండలంలో గృహ నిర్మాణాల పురోగతిపై జిల్లా గృహ నిర్మాణాధికారి బుజ్జి శుక్రవారం సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ ఆఫీస్‌లో నియోజకవర్గంలోని హౌసింగ్ అధికారులతో నిర్మాణాలను దశలవారీగా చర్చించారు. త్వరలో సీఎం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లను సామూహిక గృహప్రవేశాలు చేయనందున నిర్మాణ పనులు వేగ వంతం చేయాలని ఆదేశించారు. ఈఈ సీహెచ్ వేణుగోపాలస్వామి, డీఈఈ శేఖర్ బాబు, ఏఈలు పాల్గొన్నారు.

News October 3, 2025

21 రహదారుల విస్తరణకు ప్లాన్ సిద్ధం చేయాలి: కలెక్టర్

image

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి నగరపాలక సంస్థ తరఫున ప్రతిపాదనలను సహేతుకంగా రూపొందించి నివేదించాలని కలెక్టర్, కమిషనర్ (F.A.C) కీర్తి చేకూరి అధికారులకు సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో శుక్రవారం సమీక్ష చేశారు. తొలుత 21 రహదారుల విస్తరణకు సంబంధించి రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించారు.

News October 3, 2025

రాజమండ్రి: ఆటో డ్రైవర్లకు రూ.17 కోట్ల 87 లక్షల ఆర్థిక సాయం

image

ప్రభుత్వం ప్రవేశపెట్టిన “ఆటో డ్రైవర్లు సేవలో” పథకం కింద తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 11,915 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారని జిల్లా రవాణా అధికారి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు రూ.15,000 చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మొత్తం రూ.17,87,25,000ల మేర ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.