News March 4, 2025
జగ్గంపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకులు వీరే

జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన రౌతుల హర్ష (14), వేణుం మణికంఠ (17) , షేక్ అబ్దుల్లా (17)లు జగ్గంపేట వస్తుందంగా ప్రమాదం జరిగిందని తెలిపారు.
Similar News
News February 25, 2026
GNT: ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1,095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవుదినాల కారణంగా ముందుగానే పింఛన్లు ఇవ్వడం ఇది ఏడోసారి. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
News February 25, 2026
రష్యన్ అమ్మాయిలతో అఫైర్ నిజమే.. కానీ: బిల్‌గేట్స్

‘ఎప్‌స్టీన్ ఫైల్స్’లో తన పేరు రావడంపై గేట్స్ ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు చెప్పారు. లైంగిక నేరగాడు ఎప్‌స్టీన్‌ను కలిసి తాను పెద్ద తప్పు చేశానని.. దాని వల్ల ఇబ్బంది పడ్డ వారికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. రష్యన్ అమ్మాయిలతో అఫైర్ ఉందని.. ఈ విషయాన్ని ఎప్‌స్టీన్ తెలుసుకున్న మాట నిజమేనని అంగీకరించారు. కానీ ఎప్‌స్టీన్ బాధితులతో సంబంధం లేదని.. తాను చట్టవిరుద్ధమైన పనులు చేయలేదన్నారు.
News February 25, 2026
KNR: ‘విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలి’

వచ్చే నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం చింతకుంట జడ్పీ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించారు. విద్యార్థుల నమూనా పరీక్ష పత్రాలను పరిశీలించి, వెనుకబడిన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధం చేయాలన్నారు.


