News October 25, 2025

జగ్గయ్యపేట: నాడు తండ్రి.. నేడు కుమారుడు గుండెపోటుతో మృతి

image

పదేహేనేళ్లకే కొడుకు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ తల్లి తల్లడిల్లింది. విగతజీవిగా పడి ఉన్న కుమారుడ్ని చూసి ఆమె రోదించిన తీరు వర్ణనాతీతం. జగ్గయ్యపేటలో గోలి వెంకట గణేష్ నిన్న పాఠశాలకు వెళుతూ గుండెపోటుతో మరణించాడు. బాలుడి తండ్రి రామారావు 2ఏళ్ల క్రితం గుండెపోటుతోనే చనిపోయాడు. మరో అయిదేళ్లలో కొడుకు చేతికొస్తాడకున్న ఆ తల్లి ఆశల్ని నిరాశలు చేస్తూ గణేశ్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం అందర్నీ కలిచివేసింది.

Similar News

News October 25, 2025

‘ఎస్‌ఐఆర్‌’ పకడ్బందీగా రూపొందించాలి: సీఈఓ సుదర్శన్‌ రెడ్డి

image

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)ను పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌ రెడ్డి, అదనపు ఎన్నికల అధికారి లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం రిటర్నింగ్‌ అధికారులతో ఎస్‌ఐఆర్‌పై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌లో భాగంగా కేటగిరి ‘ఏ’ను బీఎల్‌ఓ యాప్‌ ద్వారా ధ్రువీకరిస్తామని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు.

News October 25, 2025

అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సెలవులు

image

భారీ వర్షాల కారణంగా కలెక్టర్ సూచనలతో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ డీఈవో సుబ్రహ్మణ్యం నేడు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమాచారాన్ని అన్ని డివిజన్ల విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారుల వారి పరిధిలోని హెచ్ఎంలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆదివారం కూడా సెలవు కావడంతో పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవు వచ్చాయి.

News October 25, 2025

పర్యాటక హోమ్ స్టే నమూనాల అభివృద్ధికి చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పర్యాటక హోమ్ స్టే నమూనాలను సేకరించి, పైలెట్ ప్రాజెక్టుగా ఒక హోం స్టే గృహాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. పర్యాటకులకు సనాతన వారసత్వ సంస్కృతి, సాంప్రదాయ అనుభూతిని అందించేలా ఈ చర్యలు ఉండాలని ఆయన కోరారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పర్యాటక రంగాభివృద్ధి కమిటీ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించి, జిల్లాలో పర్యాటకరంగా అభివృద్ధి అంశాలపై చర్చించారు.