News April 14, 2025

జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

బాదేపల్లిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందన ఘటన నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. పాతబజార్‌కు చెందిన అంజమ్మ(73) శనివారం రాత్రి తన చిన్న కొడుకు నగేశ్ ఇంట్లో నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున ఇంటి ఎదుట రోడ్డుపై శవమై కనిపించింది. ఇంట్లో పడుకున్న ఆమె రోడ్డుపై శవమై పడి ఉండటంతో కుటుంబసభ్యుల అనుమానం వ్యక్తం చేశారు. ఆమె మృతికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. ఈమేరకు కేసు నమోదైంది.

Similar News

News April 16, 2025

పాలమూరు జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔ఆర్థిక శాస్త్రం దేశాభివృద్ధిలో ముఖ్యభూమిక:PU ప్రిన్సిపల్✔రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ✔ఉమ్మడి జిల్లాల్లో భారీ వాన✔పోలేపల్లికి పోటెత్తిన భక్తులు✔పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ✔మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

News April 15, 2025

మహబూబ్‌నగర్: కలెక్టర్ కదా కారులో.. వస్తారనుకున్నారా..!

image

తాము చేపట్టే పనుల్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ కారులో వస్తారని అనుకున్న అధికారులకు కాలినడకన వచ్చి అధికారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి.. మండల పరిధిలోని తుమ్మలకుంట వంటి గుడిసే తండా, చిన్న గుట్ట తండా, తుమ్మలకుంట, వల్లూర్ గ్రామాల్లో చేపడుతున్న పునరావాస పనుల్ని మంగళవారం కలెక్టర్ విజయేంద్ర బోయి ఎండను సైతం లెక్కచేయకుండా మూడు గంటలపాటు కాలినడకన వెళ్లి పరిశీలించారు.

News April 15, 2025

మహమ్మదాబాద్: పట్టపగలే భారీ చోరీ

image

MBNR జిల్లా మహమ్మదాబాద్ మండలం నంచర్ల గ్రామంలో పట్టపగలే భారీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి స్థానికుడు శివగోపాల్ నివాసానికి వచ్చారు. ఇంట్లో ఉన్న మహిళపై స్ప్రే చేసి స్పృహ కోల్పోయేలా చేసి, ఇంట్లో నుంచి రూ.6 లక్షలు, వారి దుకాణంలోని రూ.50 వేలతో పాటు మెడలోని 3 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. సీఐ గాంధీ, ఎస్ఐ శేఖర్ వచ్చి కేసు నమోదు చేశారు.

error: Content is protected !!