News October 9, 2025

జడ్చర్ల: అన్న మరణ వార్త విని తమ్ముడు మృతి

image

జడ్చర్లలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన వలిపె సురేందర్‌రావు గురువారం మృతిచెందారు. వనపర్తిలో నివసిస్తున్న ఆయన తమ్ముడు వలిపె నరసింహారావు అన్న మరణ వార్త వినగానే కుప్పకూలి మృతిచెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బ్రాహ్మణ సంఘం సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Similar News

News October 9, 2025

శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బదిలీ

image

సత్యసాయి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను ఆంధ్రప్రదేశ్‌ మెరిటైమ్‌ బోర్డు సీఈఓగా నియమించారు. అదనంగా ఏపీ మెరిటైమ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వైస్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.

News October 9, 2025

కోస్గి: ‘కోర్టు తీర్పు నిరాశ కలిగించింది’

image

బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు బాధ కలిగించిందని ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్లు ఊరించి ఉసూరుమనిపించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు అగ్రవర్ణాల వారు బీసీలపై కక్ష కట్టి కేసు వేయడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.

News October 9, 2025

ట్రంప్‌కు మోదీ శుభాకాంక్షలు

image

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌‌‌తో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. గాజా శాంతి ప్రణాళిక విజయవంతమైనందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినట్లు ట్వీట్ చేశారు. భారత్, US మధ్య ట్రేడ్ చర్చల పురోగతిపై సమీక్షించినట్లు తెలిపారు. భవిష్యత్‌లో ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగించేందుకు అంగీకరించినట్లు పేర్కొన్నారు.