News February 25, 2025
జడ్చర్ల: ఆటో, బైక్ ఢీ.. యువకుడికి గాయాలు

జడ్చర్ల మండలం నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో ఆసుపత్రికి తరలించారు. నసురుల్లాబాద్ శివారులోని మూలమలుపు వద్ద తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 25, 2025
జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్‌కి చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కి తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 25, 2025
మహబూబ్‌నగర్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

ఉమ్మడి MBNR జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. వివరాలిలా.. కొత్తకోటకు చెందిన చరణ్‌రెడ్డి, అనిల్ HYDకి వెళ్తూ బైక్ అదుపు తప్పి మృతిచెందారు. కొత్తపల్లి మండలం నిడ్జింతతండాలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో మద్దూరుకు చెందిన రాములు చనిపోయారు. పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకెళ్తుండగా బొలెరో వాహనం వారి బైక్‌ను ఢీకొనడంతో వడ్డేపల్లి మండల వాసి మురళి స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు.
News February 24, 2025
MBNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మూసాపేట్ మండల పరిధిలోని గాజులపేట సమీపంలో జాతీయ రహదారిపై కొత్తకోట, మదనాపూర్ గ్రామాలకు చెందిన చరణ్ (25), అనిల్ (22) బైక్‌పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో గాజులపేట సమీపంలో రహదారిపై వంతెన గోడకు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. ఘటన స్థలాన్ని భూత్పూర్ సీఐ రామకృష్ణ పరిశీలించారు.